మహా వెలుగు, ప్రతినిధి మహబూబాబాద్, ఏప్రిల్ -13: మహబూబాబాద్ జిల్లాలోని పల్లె దవాఖానాలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రం లో పనిచేయుటకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి కలిగిన వారు తేదీ 18 ఏప్రిల్ 2022న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయమునకు రావలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. పల్లె దవాఖానాల్లో 61 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీరికి నెలకి రూపాయలు 52,000/- వేతనం ఇవ్వనున్నట్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల లో 5 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీరికి నెలకు వేతనము 52,000/- ఇవ్వనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా మహబూబాబాద్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పార్ట్ టైం డాక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని ఇందులో పనిచేసే వారికి 25740/- రూపాయల వేతనం చెల్లిస్తామని తెలిపారు.
కావున ఎంబీబీఎస్ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అందరూ ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
