బాలింత గర్భిణీ స్త్రీలకు పౌష్ఠిక ఆహారం

  • సర్పంచ్ బోడ శ్రీను నాయక్

మహావెలుగు కురవి/మే2 రిపోర్టర్ చల్ల వేణు

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బి బి నాయక్ తండ సర్పంచ్ బొడ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలోని భూక్యా తండ బోడ తండ అంగన్వాడీ కేంద్రాల వద్ద గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లల కు బాలింత లకు కోడి గుడ్లు బాల అమృతం పౌష్టికాహారం అందజేశారు. గర్భిణీ స్త్రీలు ఈ ఎండాకాలం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడ శ్రీను నాయక్, అంగన్వాడీ టీచర్ బోడ పద్మ ,భూక్యా సరోజ, అంగన్వాడీ వర్కర్లు అశ వర్కర్లు పాల్గొన్నారు.