పని చేయని కాంట్రాక్టర్లను తొలగించి కొత్తవారిని నియమించాలి

అవసరమైతే పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించి ,కొత్తవారిని నియమించాలని ,ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో లో నియోజకవర్గ స్థాయి మిషన్ భగీరథ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. వార్డు గ్రామ మండల మున్సిపల్ స్థాయిలో ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. రానున్నది వేసవి కాలం కాబట్టి అధికారులతో పాటు నాయకులు గ్రామాల్లో విధీ గా ఉంటూ ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని వారు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని హ్యాబిటేషన్ కి మంచినీటి సరఫరా జరగాలని, అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన గ్రామాల్లో జరుగుతున్న నీటి సరఫరా లో లీకేజీలు గాని డ్యామేజ్ లు గాని ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు మరింత వేగవంతంగా జరిగేలా చూడాలని వారు తెలిపారు. మీషన్ భగీరథ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే పై అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ అంజన్ రావు , ఈఈ గ్రిడ్ మధుసూదన్ ,ఏఈ ,జేఈ, డి ఈ,ఏజెన్సీ ప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు ,పాల్గొన్నారు.