ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుక కొరికింది ప్రభుత్వం సీరియస్

మహా వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికిన ఘటన రోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.

ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే పేషెంట్ కిడ్నీ వ్యాధితో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్ళను ఎలుకలు కొరికిన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చేరిన మొదటి రోజు శ్రీనివాస్ కుడిచెయ్యి వేళ్లను ఎలుకలు కొరికాయి. దీంతో గాయాలపాలైన శ్రీనివాస్ కు వైద్యులు కట్టు కట్టారు. ఆపై మళ్లీ ఈరోజు శ్రీనివాస్ కాళ్లను, ఎడమ చెయ్యి వేళ్ళను ఎలుకలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మళ్లీ వైద్యులు కట్టు కట్టారు.

ఎలుకలతో రోగుల ప్రాణాలకు ఇంతగా హాని జరుగుతున్న ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది పని చేస్తున్నా రోగుల పరిస్థితి పట్టించుకోకపోవటంపై మండిపడుతున్నారు. ఐసియూ లో ఇటువంటి ఇటువంటి ఘటనలు జరగడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలు కొరకుతున్నాయని డాక్టర్ల దృష్టికి తీసుకెళితే, డాక్టర్లు ఎలుకలు కొరికిన చోట కట్లు కట్టి తామేమీ చేయలేమని చెబుతున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు.

వైద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతున్న దారుణ ఘటన


పైప్లైన్ ద్వారా ఎలుకలు లోపలికి వచ్చి పేషంట్లను కొరుకుతున్నాయని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బెడద ఇంతగా ఉంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎలుకల నివారణకు చర్యలు తీసుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరతెలంగాణాలోనే అతి పెద్ద ఆస్పత్రి అయిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం వైద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుందని అంటున్నారు

ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్, విచారణకు కలెక్టర్ కు ఆదేశం
ఇక ఎలుకల బెడద పై ఆర్ఎం వో మురళి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వార్డుకు వెళ్లి పరిశీలించారు. ఎలుకలు నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగి బంధువులతో మాట్లాడారు. ఇక వరంగల్ ఎంజీఎం లో పేషెంట్లను ఎలుకలు కొరుకుతున్న ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై