ప్రజా సమస్యల పరిష్కారానికై 7 వ తారీకున జిల్లా కేంద్రంలో ధర్నాను జయప్రదం చేయాలి

మహావెలుగు కురవి/ జూన్3 రిపోర్టర్ చల్ల వేణు : పొడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇవ్వకుండా మరో పక్కా పొడుసాగుదారులపై ఫారెస్టు అధికారులను ఉసిగొల్పి పొడు రైతులపై దాడులు చేయడం, రైతుల నుండి బలవంతం గా భూములను గుంజుకోవడం, ట్రెంచ్ లు కొట్టడన్ని
నిరసిస్తూ సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 7న, మహబూబాద్ జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన ధర్నాను నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చారు.

అ పిలుపు లొ భాగంగా కురవి మండలం చౌళ్ల తండా గ్రామం లొ సీపీఐ (యం యల్ )న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జరుగు మహా ప్రదర్శన జయప్రదం చేయాలనీ కోరుతు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చారి హరీష్ మాట్లాడుతూ… అందమైన హామీలతో ప్రయోగం గురించి పదవిలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు దళితులకు గిరిజనులకు కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. 57 సంవత్సరాలకు ఆసరా పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసి నాలుగు ఏళ్ళు నిండుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసేలేదు రైతు రుణమాఫీ వాయిదాల పద్ధతిలో అమలు కూడా అసలు కంటే ఎక్కువ వడ్డీ భారం మోపుతున్నారు, ఉచిత విద్య నిరుద్యోగ భృతి లాంటి హామీలను విద్యార్ధి యువజనులను వెక్కిరిస్తున్నాయి. ఓ పక్క పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి మరో పక్క ఫారెస్ట్ అధికారి వారిపై అక్రమంగా దాడులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని ఈ నెల 7న జరుగు మహాధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చాట్ల నారాయణ, పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్, సమ్మక్క, చరణ్, మైసమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.