పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు: పెద్దపల్లి ఏసిపి సారంగపాణి

మహా వెలుగు పెద్దపల్లి 01 : మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జండా కూడలి తోపాటు పోలీస్ స్టేషన్ సమీపంలో చలివేంద్రాలను ప్రారంభించారు.

ఈసందర్బంగా ఏసీపీ గారు మాట్లాడుతూ…. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారాన్నారు. పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతం ప్రజలు వివిధ పనుల్లో బయటకు వచ్చిన వారు పరిసర ప్రాంతాలలో తోపుడు బండ్ల వ్యాపారులు, చుట్టుప్రక్కల చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చలి వేంద్రం ఏర్పాటు చేసినట్లు ఏసీపీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి సిఐ లు ప్రదీప్ కుమార్, అనిల్, ఎస్ఐ లు రాజేష్, రాజ వర్ధన్, మహేందర్, శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.