మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 30 :నియోజకవర్గ ప్రజల కోసం ఆ ఎమ్మెల్యే నిప్పుల్లో నడిచారు. నిత్యం జనం లో ఉండే ఆయన తమ నియోజకవర్గ ప్రజలు బగుండాలని ఆ ఎమ్మెల్యే వారి కోసం నిప్పుల్లో నడిచారు. ఏ సమస్య వచ్చిన వారి సమస్యలు తీర్చుతుంటారు. భక్తి విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయరు. ఆయనే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గురువారం అంతర్గాం మండల కేంద్రంలో జరుగుతున్న నూకాంబిక అమ్మవారి జాతరలో ఆయన పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అగ్నిగుండంలో నడిచారు. అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.