ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీస్ లా ద్వేయం

మహావెలుగు పెద్దపల్లి ప్రతినిధి 25 : ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీస్ లా ద్వేయమని ,ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావ కలిగించడం గురించి “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” లో భాగంగా ఎన్టీపీసీలో కార్డెన్ సర్చ్ ఏసీపీ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ మాట్లాడుతూ ..ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పికే రామయ్య కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి సరైన ధృవ పత్రాలు లేని 50 బైకులు, రెండు ఆటోలు, 4 ట్రాలీలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి వాహనాలకు ఆర్సి, ఇన్సూరెన్స్,
మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగివుండాలన్నారు, ఎలాంటి
పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట
ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.