- ములుగు ఎమ్మెల్యే సీతక్క…
బాధిత కుటుంబాలను పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సాయం తో పాటు 11 క్వింటాళ్ల బియ్యం అందచేత - బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం తో పాటు తక్షణ సాయం కింద ఇంటికో 1లక్ష రూపాయలు ప్రభుత్వం అందించాలి
వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/ములుగు 28 : మంగపేట మండలం శనిగ కుంట గ్రామములో నిన్న రాత్రి అగ్నిప్రమాదం సంభవించి 24 ఇండ్లు పూర్తిగా దగ్ధం కాగా వారి కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం తో రూ. 50 వేల తక్షణ ఆర్థిక సాయం తో పాటు 11 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర వస్తువులు బట్టలు,వంట సామాగ్రి బాధిత కుటుంబాలకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ …..ప్రభుత్వ యుద్ద ప్రాతిపదికన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం తో పాటు ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల తక్షణ సాయం అందించాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు.
ఈ పర్యటనలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి , పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యణయ్య ,మండల ఉపాధ్యక్షులు బాగ్వాన్రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లేపల్లి శివయ్య తదితరులు పాల్గొన్నారు..

