- జిల్లాలో ఇష్టారాజంగా టపాసుల వ్యాపారం
- భీమారంలో పర్మిషన్ లేకుండానే జన సముదాయాల్లోనే బాన సంచ విక్రయాలు
- ముందుగానే ముడుపులు చెల్లించిన వ్యాపారదారులు…?
- జరగ రానిది జరుగుతే బాధ్యత ఎవరు వహిస్తారు….?
మహా వెలుగు , మంచిర్యాల ( భీమారo 23) : దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందో లేదో తెలియదు కానీ టపాసుల వ్యాపారుల గల్లపెట్టే మాత్రం నింపుతుంది బాణసంచా కొనుగోలు చేసిన వినియోగదారులకు జీఎస్టీ ఆధారిత బిల్లులు ఇవ్వకుండా సర్కార్ ఖజానాలకు గండి కొడుతున్నారు.
పర్మిషన్ లేకుండా జనవాసాల్లో టపాసులు అమ్మకాలు
పర్మిషన్ లేకున్నా జనవాసాల్లో టపాసులు అమ్మకం జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల చెన్నూరు చెన్నూరు జాతీయ రహదారి ఇరువైపులా టెంట్లు వేసి మరి అమ్మకాలను కొనసాగిస్తున్నారు. మండలంలో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది దుకాణదారులు అమ్మకాల్లో జీరో దందాకు తెరలేపుతున్నారు.
జనవాసలకు దూరంగా పెట్టాలి …
టపాసుల వ్యాపారం జనావాసాలకు దూరంగా పెట్టాలని రూల్స్ ఉన్న అధికారుల వైఫల్యంతో జనవాసాల్లోనే టపాసులను అధిక సంఖ్యలో అమ్ముతున్నారు ఇక్కడ అధికారులను మంచిగా చేసుకొని దందాను కొనసాగిస్తున్నారు. స్ట్రాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్య వ్యవహారంతో వ్యాపారులు తమ గల్లాలను నింపుకుంటున్నారు. కానరానిది అయితే బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఓపెన్ ల్యాండ్ లో పెట్టాల్సిన స్ట్రాలు జనవాసాల్లో పెట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు.
భీమారo లోనే రూల్స్ కి విరుద్ధంగా…..
మంచిర్యాల చెన్నూరు శ్రీరాంపూర్ సీసీ కార్నర్ తోపాటు వివిధ పట్టణాల్లో దూరంగానే పటాసుల స్టాళ్లను ఏర్పాటు చేశారు కానీ ఒక భీమారంలో మాత్రం జనవసాల్లో స్ట్రాలను ఏర్పాటు చేశారు. పర్మిషన్ లేకున్నా అమ్మకాలను కొనసాగిస్తున్నారు ఎంత జరుగుతున్న అధికారులు దానిపై చర్యలు తీసుకుపోవడం పై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి టపాసుల పై 18 నుంచి 20% వరకు జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది అయితే ఇక్కడ జీరో దొందకు తెర లేపడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. అంతేకాకుండా అధిక ధరలకు అమ్మకాలు చేపట్టడంతో కొనుగోలు దారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.