మహా వెలుగు, చెన్నూర్ 15 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కర ఘాట్ లో బొడ్ల సోమేశ్ (39) ఆంద్రప్రదేశ్ వైజాగ్ వాసి స్నానం కోసం వెళ్ళగా నీటిలో మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
