ప్రాణహిత పుష్కారాలు ప్రారంభo

మహా వెలుగు,చెన్నూర్ : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ,ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ,బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.