ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి

మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ గోపాల కృష్ణా జన్నారం 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీడీఓ అరుణా రాణి అన్నారు.మంగళవారం పోనకల్ రైతు వేదికలో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య పనులు, నర్సరీ నిర్వహణ, వైకుంఠధామాలు, కాంపోస్ట్‌ షెడ్లు నిర్వహణ, హరితహారం పనులు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో రమేష్,ఏపీవో రవీందర్ వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు