ప్రేమిస్తున్న అని వేధించి కత్తితో స్టూడెంట్ పై దాడి

  • హన్మ కొండ లో ప్రేమోన్మాది అజహర్ దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదన్న కక్షతో కాకతీయ యూనివర్శిటీ ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు

మహా వెలుగు హనుమకొండ 22 : హన్మకొండ పట్టణంలో ప్రేమాన్మాది రెచ్చిపోయాడు. కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ చదువుతున్న అనూష(23) అనే యువతిని అజహర్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడం కక్ష పెంచుకున్న అజహర్… గురువారం పోచమ్మగుడి సమీపంలో అనూషపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. గొంతుకోసి ప్రాణం తీసేందుకు యత్నించగా స్థానికులు కేకలు వేయడంతో అక్కడికి నుంచి పరారయ్యాడు.


ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనూష పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు అజహర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.