ఫోన్ లో ప్రియుడితో గొడవ మహిళ ఆత్మహత్య

ఫోన్ లో ప్రియుడితో గొడవ పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలో నెలకొంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కాతేపల్లి లక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మి – రమణయ్య భార్యాభర్తలు కాగా వారికి ముగ్గురు సంతానం ,పెద్ద కొడుకు నరసింహ , కూతురు శిల్ప , చిన్న కొడుకు నరేంద్ర ఉన్నారు. కాగా శిల్ప ని కాగజ్ నగర్ కు చెందిన కరవేణి సాగర్ తో వివాహం అయింది. ఆమెకు హెచ్ఐవి సోకడంతో ఇరువురు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుని ఉంటున్నారు. దీనిలో భాగంగానే పట్టణానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. అతను పెళ్లి చేసుకుంటానని అంటున్నట్లు కూతురు తల్లికి తెలిపేది, అతనితో తరచుగా ఫోన్ లో లో మాట్లాడేది ఇదే క్రమంలో రాత్రి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుని పెళ్లి విషయంలో గొడవ పడడంతో ఆమె ఫోన్ స్విచాఫ్ చేసింది. శ్రీకాంత్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ అనేది లిఫ్ట్ చేయలేదు. దీంతో శ్రీకాంత్ శిల్ప ఇంటికి వెళ్ళమని తెలిసినవారికి చెప్పగా శిల్ప ఉరి వేసుకొని విగతజీవిగా ఉంది ప్రియుడు శ్రీకాంత్ తిట్టడం తోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో ఫోన్ లో పడిన గొడవతో శిల్ప మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు కాగా సంఘటన స్థలంను ఎస్ఐ అశోక్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.