ప్రియుని మోజులో భార్య, భర్త అనుమానాస్పద మృతి

మహబూబాబాద్ సెప్టెంబర్ 06: వివాహేతారా సంబంధం ప్రాణం తీసింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్లకు చెందిన కొమిరె జంపయ్య భార్యతో.. ఆమె ప్రియుడు తోట నరేశ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆపై విడాకులు ఇచ్చేయాలని లేదంటే చంపేస్తానని జంపయ్యను బెదిరించాడు. ఇదంతా జంపయ్య తన తమ్ముడికి కాల్ చేసి చెప్పాడు. ఈ క్రమంలోనే జంపయ్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. జంపయ్య మృతదేహంతో నరేశ్​ ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.