మహా వెలుగు చెన్నూర్ 13 : ఎగువ నుంచి వస్తున్న వరద, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం ఎప్పటికప్పుడు పెరుగుతున్న క్రమంలో గోదావరి నది పరివాహక గ్రామాలైన కోటపల్లి మండలం దేవులవాడ, కొల్లూరు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొల్లూరు లో ఏర్పాటు చేసిన పునరావాసాన్ని సందర్శించి విప్ సుమన్ ప్రజలకు ధైర్యాన్ని కల్పించారు.

అంతే కాకుండా ఆయనే దగ్గర ఉండి వారికి భోజన సదుపాయాలు కల్పించి వారి తో కాసేపు మాట్లాడారు. తాము దైర్యంగా ఉండాలని ఒక్క రెండు మూడు రోజులు ఓపిక పట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏసీపీ నరేందర్ , వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు , నాయకులు అసం పల్లి సంపత్ , విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.

