ఆర్ జి 1 ఏరియా జీఎం కె.నారాయణ
మహా వెలుగు రామగుండం సెప్టెంబెట్ 20:- రాకేష్ నామని : మంగళవారం ఆర్ జి 1 జీఎం కార్యలయం లో మెడికల్ ఇన్ వాలిడేషన్ మరియు చనిపోయిన ఎన్ సీ డబల్యూ ఏ ఉద్యోగుల డిపెండెంట్స్ 23 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్ జి 1 జనరల్ మేనేజర్ శ్రీ కె. నారాయణ గారి చేతుల మీదుగా అందించటం జరిగింది.ఈ సంధర్భాన్ని పురస్కరించుకొని ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కె. నారాయణ మాట్లాడుతూ సింగరేణి సి&ఏం.డి. ఎన్. శ్రీధర్ ఐ.ఎ.ఎస్ చొరవతో త్వరిత గతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించటం జరిగిందని అన్నారు. మెడికాల్ బోర్డ్ కు దరఖాస్తు చేసున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించటం త్వరిత గతిన అవుతుందని అన్నారు. ఈ రోజు ఆర్జీ-1 ఏరియాలో 23 మంది డిపెండెంట్లకు ఒకే దఫా కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, ఇందులో 5 మంది మహిళలు , 18 మంది పురుషులు ఉన్నారు . వీరికి ఆర్ జి 1 ఏరియా లో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు . అతి తక్కువ సమయం లో వీరికి పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని అన్నారు.జాయిస్ కాబోవు ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరచు కొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు . సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతులలో ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యేక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదే విధంగా ఇట్టి ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లి , తండ్రులను గౌరవించాలని సూచించారు .ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాద్యక్షులు గండ్ర ధామోదర్ రావు , సి ఏం ఓ ఏ ఐ అధ్యక్షులు పోనోగోటి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ సి.హెచ్ . లక్ష్మి నారాయణ గారు, జీఎం ఆఫీస్ ఇంచార్జ్ ప్రవీణ్ , సెక్యూరిటీ అధికారి వీరా రెడ్డి ,సర్వే అధికారి ప్రభాకర్ , సీనియర్ పర్సనల్ అధికారి (శావణ్ , డిప్యూటీ సుపరిడెంట్ మల్లీశ్వర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.