మహా వెలుగు మంచిర్యాల 23 : మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారి పశువుల అడ్డాగా మారింది. ఈ జాతీయ ‘రహదారి పశువుల కోసమే’ అన్నట్లు గా తయారవుతుంది. మంచిర్యాల – చెన్నూర్ ప్రధాన రహదారి పై నిత్యం వందల వెహికల్స్ ప్రయాణిస్తూ ఉన్నాయి. అటు మహారాష్ట్ర తో పాటు ,ఆంద్రప్రదేశ్ , తెలంగాణలోని మహా దేవపూర్ ,కాళేశ్వరం ,భూపాలపల్లి ,వంటి ప్రాంతాలకు వెళ్తూ , మంచిర్యాల వైపునకి వస్తుంటాయి. కానీ ‘భీమారo’ చేరుకోగానే 3 కిలో మీటర్ల పరిధి వరకు రాత్రి సమయంలో పశువులు రోడ్డు పైనే ఉంటాయి. దీనితో ద్విచక్ర వాహన దారులు ప్రాణాలు సైతం పొగుట్టున్న పరిస్థితులు ఉన్నాయి. కార్లలో ప్రయాణిస్తున్న కారు ముందు భాగం చాలా కార్లకు డ్యామేజ్ లు సైతం ఐయ్యాయి. నిత్యం చిదురు, మోదురు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకున్న నాధుడే కరువైయ్యడు.
పలు మార్లు గ్రామ పంచాయతీ దృష్టి కి తీసుక పోయిన స్పందన కరువు
గతంలో పలువురు గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపిన పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. ఫిర్యాదు చేసిన పట్టించుకున్న వారు లేరని వాహన దారులు ,గ్రామస్తులు తెలుపుతున్నారు. అంతే కాకుండా ఈ మధ్య కాలం లో పశువులు సైతం రోడ్డు ఆక్సిడెంట్ లో మరణించిన సంఘటన లు ఎన్నో ఉన్నాయి.
పశువుల కోసం భీమారo జాతీయ రహదారి
ఎక్కడైన వాహన దారులకు ,ప్రయాణికులకు రోడ్లు నిర్మిస్తారు కానీ ఇక్కడ మాత్రం పశువుల కోసం , పశువులు పడుకునేందుకు రోడ్లు నిర్మాణం చేపట్టారని ప్రజలు వాహన దారులు ,ప్రయాణికులు బహిరంగంగానే మాట్లాడటం గమనార్హం..
