మహా వెలుగు మంచిర్యాల 22 : యువకుని ఆత్మహత్య కలవరం రేపుతోంది… మంచిర్యాల జిల్లా భీమారo మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి మనోహర్( 29 ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ట్రైన్ కు పడి శవంగా మారాడు. తెలిసిన వివరాల ప్రకారం మనోహర్ గత కొంతకాలంగా మంచిర్యాల పట్టణంలో రూము అద్దెకు తీసుకొని మరో ముగ్గిరి తో ఉంటున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు సినిమా కు వెళ్తాను అని చెప్పిన మనోహర్ మళ్ళీ రూమ్ కు రాలేదు మంగళవారం ఉదయం పూట రైల్వే పోలీస్ లు తమ రూమ్ మెంట్స్ కు సమాచారం అందించగా అక్కడ వెళ్లి చూడగా మనోహర్ రైల్ పట్టాల మధ్యలో పడి ఉన్నాడు. కాగా మనోహర్ తమ బంధువుల పేరిట లెటర్ రాసి ఆత్మహత్య కు పాల్పడ్డట్లు గ్రామస్తుల తో పాటు పోలీస్ లు తెలుపుతున్నారు.
