రైతన్నల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు :

  • ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మహా వెలుగు,చెన్నూర్ : రైతన్నల గుండెల్లో చిరస్థాయిగా సీఎం కేసీఆర్ నిలిచి పోతారని , రైతుల కోసం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, 103 గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించే “చెన్నూరు ఎత్తిపోతల పథకానికి” కేబినెట్ ఆమోదం తెలిపగా ,ఇందుకోసం ప్రభుత్వం రూ.1658 కోట్లు మంజూరు చేసింది. 10 టిఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టునుండి ఈ పథకానికి వినియోగించనున్నారు.

పార్వతీ బ్యారేజ్ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25,423 ఎకరాలకు..
సరస్వతి బ్యారేజ్ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు..లక్ష్మీబారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలో 16,370 ఎకరాలకు,
మొత్తంగా 90,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని భూములకు సాగునీరు అందించనుండగా
ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ రైతన్నల చిరకాల వాంఛ, దశాబ్దాల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఈ పథకం ద్వారా చిన్న రైతన్నల గుండెల్లో ముఖ్యమంత్రి చిరస్థాయిగా నిలిచిపోతారని ఆనందం వ్యక్తం చేశారు.