- కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మాలోతు వీరన్న
మహావెలుగు కురవి/మే 23 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని హరిదాసు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని బాలు తండా లో రైతు డిక్లరేషన్ పోస్టర్ ను గ్రామ పార్టీ అధ్యక్షుడు మాలోత్ వీరన్న ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రచ్చ బండ కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీనియర్ మండల నాయకులు కురుమ దామోదర్, సురం మల్లా రెడ్డి, గుంటుక వెంకటేశం, అంబటి గోవర్ధన్,మాజీ ఎంపీటీసీ చెంగు, వార్డు సభ్యుడు దరవాత్ శ్రీనివాస్, సామ నాయక్, బానోతు వీరన్న, కరం చంద్, వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.