రైతు వేదికకు తలుపులు లేవు

మహా వెలుగు , మంచిర్యాల ( భీమారo ) 27 : మంచిర్యాల జిల్లా భీమారo మండల కేంద్రంలో ని స్థానిక రైతు వేదికకు తలుపులు లేకుండా దర్శనం ఇస్తుంది. గత నాలుగు ఐదు రోజుల క్రితం వీచిన గాడుపు దుమారం కు తలుపులు ఒక్కసారిగా కింద పడ్డాయి. రైతు వేదిక నిర్మించిన కాంట్రాక్టర్ నాసిరకపు దర్వాజ ను అమర్చడంతో ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన రైతు వేదికకు దర్వాజాలు తలుపులు నాసిరకం అమర్చడంతో దర్వాజా మొత్తం చెదలు పట్టి పోయింది. దీంతో తలుపుల తో పాటు దర్వాజా సైతం కింద పడిపోయింది.

కాగా దీనిపై ఏ ఈఓ అరుణ్ కుమార్ ను వివరణ కోరగా దర్వాజా పడిపోయింది నిజమేనని ఈ రోజు వాటిని అమరుస్తామని జవాబు ఇచ్చారు.