- పాడి రైతులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం.
- బయ్యారం పెద్ద చెరువు కాలువల శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి.
- ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.
- బయ్యారం మండల వ్యాప్తంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నిక
వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్/ బయ్యారం. 7 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలను పరిష్కరించాలనీ డిమాండ్‌తో రంగాపురం గ్రామం లో రైతు పోరాట సమావేశంలో మండల రైతు సంఘం కార్యదర్శి మక్కేన తిరుపతిరావు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నంబూరి మధు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక చర్యలను ఖండిస్తూ న్నామని, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం పండించుకోవాలి అనుకున్న రైతులను మోసపూరితంగా బెదిరింపుల ద్వారా పంట వేస్తే కొనుగోలు చేయమని అన్న మాటకు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు పంటలను వేయలేదని ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంగా భావించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి షరతులు లేకుండా వరి దాన్యాన్ని కొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలు వేర్పాటు చేసి సౌకర్యాలు కల్పపించాలని,కొనుగోలు చేసిన వెంటనే రైతు కాతాలో డబ్బు రైతు ఖాతా లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
పాడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, ప్రోత్సాహకాలు ఇవ్వటంలో, పాలను సేకరించటం లో, సరైన ధర కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని, పశుసంవర్ధక శాఖ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాకతీయుల కాలం నాటి బయ్యారం పెద్ద చెరువు కాలువలను నేటివరకు శాశ్వత నిర్మాణాలు చేయకపోవడం వల్ల కాలువలకు గండి పడి, అధిక వర్షాలు వచ్చిన సమయంలో వేసిన పంట మునిగిపోయిన అధికారులకు గాని, పాలకులు గాని పట్టనట్లు ఉందని, కేవలం ఎన్నికల కోసమే, ఎన్నికల సందర్భంలోనే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారనీ, ఇలాంటి తాత్కాలిక లో పనుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన బయ్యారం చెరువు కాలువల శాశ్వత నిర్మాణాలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురం గ్రామ పరిధిలో రైతు సంఘం కమిటీ ని ఈ సందర్భంగా ఎందుకు చేశారు. సంఘం అధ్యక్షులుగా రాయబారపు అప్పయ్య, కార్యదర్శిగా లక్ష్మారెడ్డి, సభ్యులుగా కాకి పిచ్చిరెడ్డి, నోముల ఉపేందర్ ,యం. రవి, పెంటయ్య, గొర్ల సత్తిరెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
