రైతుల బోర్లు మంజూరు

మహా వెలుగు కురవి/ మే 21 రిపోర్టర్ చల్ల వేణు : కురవి మండలంలోని ఎలక చెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ గిరి వికాసం పథకం ద్వారా మంజూరైన ముగ్గురు రైతులకు వచ్చిన బోర్లను ఎంపీడీవో సరస్వతి, ఏ పీ ఓ ఏకాంబరం లతో కలసి టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు గూగులోత్ రవి నాయక్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆమరి బాయ్, గ్రామ అధ్యక్షుడు మాలోతు రమేష్, జాటోత్ రంగన్న, వీరన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.