రక్తపు మరకలతో రాజకీయం చేస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి : యం.ల్.ఏ శంకర్ నాయక్

  • నిన్న జరిగిన కౌన్సిలర్ రవి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.
  • నన్ను అన్ని విధాలుగా దెబ్బ తీయాలనే ఆలోచనతో ఆరోపణలు చేశారు.
  • పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.
  • అరెస్ట్ తోనే కాకుండా నిందుతులకు శిక్ష పడే వరకు నేను రవి కుమార్ కుటుంబానికి తోడుగా ఉంటా.
  • రవి నాయక్ కుటుంబాన్ని అదుకుంటాను,స్వ శక్తితో చిన్న తనంలోనే ఎదిగిన ఇలాంటి వ్యక్తులంటే నాకు ఎంతో ఇష్టం.అలాంటి వారిని ప్రోత్సహిస్తా… .

మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్,వి. కపిల్ కుమార్ మహబూబాబాద్ 22 : చట్టం తన పని తను చేస్తుంది, సత్యం మాటున అసత్యం ఎంతో కాలం దాగదు,అన్నిటికీ కాలమే సమాధానం చెప్పుతుంది.రాజకీయంగా లబ్ది పొందలని జరిగిన,జరుగుతున్న అన్ని సంఘటనలకు బాధ్యున్ని చేస్తే ఉరుకునేది లేదు..రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.ఒకరిద్దరు సోషల్ మీడియా వేదికగా పాడు కూతలు కూస్తే ఆసత్యం సత్యం అవుతుందా అంటూ మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ అన్నారు.

రాజకీయ లబ్ది కోసం పాపపు మాటలు మాట్లాడి ప్రజల్లో నాకున్న మంచితనాన్ని దెబ్బతీయలని కొందరు రాజకీయ నాయకులు అసత్య ప్రచారం చేసి రవి కుమార్ రక్తపు మరకలు నాకు పూయలని చూశారు.కానీ చట్టం తన పని తను చేసి నింధితులను,జరిగిన సంఘటనను నేడు ప్రజల ముందుఉంచారు.

మాహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న నన్ను ఎలా ఎదుర్కోవలో చేత కానీ దద్దమ్మలు గత కొంత కాలంగా నన్ను ఇబ్బంది పెడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.నేను చేయని తప్పులకు ఎన్నో సార్లు అవమానాలు బరించాను, ప్రజలు నా వెంట ఉన్నారనే భావన తోనే. ఈ మధ్య సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వస్తే దాన్ని చదివి నలుగురికి ఫార్వర్డ్ చేయడం అలవాటుగా మారింది.అలా చెసే ముందు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే ముందు అతను సాటి మనిషే దాని వల్ల అతను పడే కష్టాలు ఎన్నో ఆలోచించి మన పనులు మనం చేయాలి.


రవికుమార్ అంటే నాకు చాలా ఇష్టం అని కసితో బతికే వారంటే నాకు గౌరవం అని,నలుగురికి సహాయం చేశానే తప్ప ఒక్కరికి హాని చేయలేదని,రాజకీయం చేయాలి కానీ రక్తపు మరకల మాటున కాదని, ఇప్పటికైనా ప్రజలకు చట్టం ద్వారా నిజం తెలిసినందుకు సంతోషంగా ఉందని,రవి కుమార్ మరణం మహబూబాబాద్ కి తీరని లోటని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా అదుకుంటా.