రామగుండం ప్రారిశ్రామిక ప్రాంతం కళాకారులకు నిలయం

రివైజ్ ఎస్ట్ మెషన్ వేసి టెండర్లు పిలిచి కళాభవనం పనులను త్వరగా చేపట్టండి

రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్

మహా వెలుగు న్యూస్ రామగుండం సెప్టెంబర్ 06:-

రామగుండం పారిశ్రామిక ప్రాంతం కళలకు కళాకారులకు నిలయమని ఈ ప్రాంతంలో కళాభవనం అవసరమని త్వరగతిన కళాభవనం పనులను చేపట్టాలని రామగుండం శాసన సభలో కోరుకంటి చందర్ జాతీయ రహదారుల భవనాలు, తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయనను ఎమ్మెల్యే కలిసారు. 2017 సంవత్సరంలో 4 కోట్లతో కళాభవనం నిర్మాణం కోసం టెండర్ జరిగిందని సదరు కాంట్రాక్టు మృతిచెందటంతో కళభవనం నిర్మాణ పనులు నిచిపోయాయన్నారు. కళాభవనం నిర్మాణం కోసం రివైజ్ ఎస్ట్ మెషన్ వెసి టెండర్ ప్రకియ పూర్తి చేసి కళభవనం పనులు త్వరగా ప్రారంభించాలన్నారు.