రామగుండం ఆర్ఎఫ్ సీఎల్ లో బూడిద విక్రయానికి
కసరత్తు

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా ప్రతినిధి 16 : పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఉన్న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) లో బూడిద విక్రయానికి టెండర్ని ర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్ఎఫ్ సీఎల్పాం డ్ లోని సుమారు 4 లక్షల టన్నుల బూడిదను విక్రయించేందుకు నేషనల్ ఫెర్టిలైజర్స్ కు ప్రతిపాదించారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. గతంలో నామమాత్రపు రేటుపై బూడిదను తొలగించారు.