ఉద్యోగుల కు నిలయంగా రామగుండంను చేస్తా : ఎమ్మెల్యే కోరుకంటి చందర్

మహా వెలుగు రామగుండము 30: రామగుండాన్ని ఉద్యోగులకు నిలయంగా చేయాలన్నదే తన తపనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే చందర్ టీఎస్ ఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, ప్రాజెక్టు మేనేజర్ సృజన్ గోదావరిఖని పట్టణంలోని బి గెస్ట్ హౌజ్ ను ఐటీపార్కు ఎర్పాటు కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో ఐటీ సేవలు అందుబాటులోకి తేవడానికి మంత్రి కేటీఆర్‌ను కోరగా మంత్రి సానుకులంగా స్పందించారన్నారు.
రామగుండంలో ఐటీ పార్కు కోసం మున్సిపల్ కార్యాలయం వెనక ఉన్న ఎకరం స్థలంలో ఎర్పాటు కోసం పనులు మెదలు పెట్టామన్నారు. అయితే పనులు అలస్యం కావడంతో ఈ ప్రాంతంలో ఐటీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనిసింగరేణి బి గెస్ట్ హోజ్ లో తాత్కాలికంగా ఐటీ పార్క్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. రామగుండం నియోజకవర్గంలోని,నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి ‌అనిల్ కుమార్ తదితరులున్నారు.