రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై గుంటూరుజిల్లా ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడిరచింది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణ హత్యచేసినట్లు ఆధారాలతో సహా రుజువు కావడంతో అతన్ని హంతకుడిగా పరిగణిస్తూ ఉరిశిక్షను విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్ట్ 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి శశికృష్ణ హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా 24 గంటల్లోనే శశికృష్ణను పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 36 మందిని విచారించిన పోలీసులు 15 రోజుల వ్యవధిలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని కూడా చూసిన న్యాయమూర్తి ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి కాసేపటి క్రితం తీర్పును వెలువరించారు. శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు.

