రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ దగ్గర రియల్‌ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి రఘు ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
దీంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రఘు పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 10 ఎకరాల భూమిని శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈ భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశారు. అప్పటికే భూమి మట్టారెడ్డి అనే వ్యక్తి కబ్బాలో ఉన్నట్లు తెలుస్తోంది.
మట్టారెడ్డితో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డికి వాగ్వాదంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేపట్టారు. కారులో ఉన్న మూడో వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు.