రెబ్బెన ఎస్సైపై కేసు వాపస్..!

మహా వెలుగు , మంచిర్యాల 12 : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన ఎస్సై భవాని సేన్ తనను లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేసిన యువతి ఆ కేసును వెనక్కి తీసుకుంది. సదరు ఎస్సై భార్య ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆందోళనకు గురై కేసును వెనక్కి తీసుకున్నట్లు యువతి తెలిపింది. కేసు వాపస్ తీసుకోవాలని తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని చెప్పింది. కేసులంటూ తిరిగితే భవిష్యత్తులో ఉద్యోగం రాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి తెలిపింది.