రెండు వందల ఇవ్వలేదని కన్న తల్లినే…..

మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. రాజీవ్ నగర్ లో తాగడానికి కన్న తల్లి డబ్బులు ఇవ్వలేదని కోపం తో కసాయి కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. తాపీ మేస్త్రిగా పనిచేసే కడమంద చంద్రశేఖర్ శనివారం సాయంత్రం మద్యo తాగేందుకు రూ.200 ఇవ్వలేదని కోపం తో తల్లి సత్యమ్మను గొడ్డలితో నరికి చంపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.