రిటైర్డ్ ఎస్ఐ రోడ్డు ప్రమాదంలో మృతి

మహా వెలుగు కరీంనగర్ ప్రతినిధి 24 ; కరీంనగర్ జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఎస్‌ఐ పాడి రాజిరెడ్డి దుర్మరణం చెందారు. కరీంనగర్‌లోని గోదాం గడ్డలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి వరంగల్ జిల్లా నడికుడ మండలం నరసక్కపల్లి నివాసి. గురువారం తెల్లవారు జామున తన సొంతూరుకు టీఎస్ 02, ఎఫ్ బి, 4556 నెంబర్ కారులో వెళ్తుండగా హుజురాబాద్ పట్టణ సమీపంలో చెట్టుకు ఢీ కొనడంతో మృత్యువాత పడ్డారు. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కొంతకాలం ఎస్ ఐబీలో కూడా పనిచేసిన రాజిరెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన కూతురు వివాహం అయి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన మంచిర్యాల జిల్లా భీమారo కు ఎస్ఐ గా విధులు నిర్వహించారు. ఆయన గుడుంబా ,ఓపెన్ లిక్కర్ ,డ్రంకన్ డ్రైవ్ లో సమర్థ వంతంగా విధులు నిర్వహించారు.

హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.