RFCL బాధితులు ఫిర్యాదు చేసినట్లయితే చట్టపరిధిలో న్యాయం జరిగేలా తప్పక చూస్తాం

బాధితులకు పోలీస్ శాఖ తరపున చట్ట పరిధిలో అండగా ఉంటాం : సీఐ లక్ష్మి నారాయణ

మహా వెలుగు ,రామగుండం 01 : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు RFCL బాధితులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేసినట్లయితే నిందితులపై కేసులు నమోదు చేసి వారికి చట్టపరమైన శిక్షపడేలా చూస్తూ చట్ట పరిధిలో బాధితులకు న్యాయం తప్పకుండా చేస్తామని రామగుండం సీఐ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకు గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో ఎన్టిపిసి పోలీస్ స్టేషన్లో 03 కేసులు, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 03 కేసులు, గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో 01 కేసు, కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో 01 కేసు, మరియు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా 01 కేసు నమోదు చేయడం జరిగిందని మొత్తం 9 కేసులలో 11 మంది దళారులపై కేసు నమోదు చేయడం జరిగిందని, బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లయితే దళరాలు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.

బాధితులు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడడం లేదా చట్ట వ్యతిరేకం చర్యలకు పాల్పడడం వలన ఏమి రాదని సమస్య పరిష్కారం జరగదు అని భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేసి పోలీస్ శాఖ బాధితులకు అండగా ఉంటుందని రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణత లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలపారు.