- దళారుల మోసానికి మరో వ్యక్తి బలి అయితాడా
- న్యాయం జరిగేటప్పుడు అసలు న్యాయం చేసేది ఎవరు
మహా వెలుగు ,రామగుండం సెప్టెంబర్ 06:-రామగుండం ఎరువుల కర్మాగారానికి చెందిన నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు ఉద్యోగాల కోసం దళారులకు లక్షలకు లక్షల సమర్పించిన బాధితుల ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీష్ ఘటన మరువక ముందే మరో బాధితుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం సంచలనంగా మారింది వివరాలకు వెళ్తే పాలకుర్తి మండలం ముంజంపల్లికి చెందిన గంగుల శేఖర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు దీంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు.