మహా వెలుగు, రామగుండం, ఆగష్టు 02: పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ రూల్స్ ఫై పెద్దపల్లి పోలీసు వారి ఆధ్వర్యంలో ట్రీనిటీ కళాశాల విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ…..అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతపై అవగాహన ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ సైడ్ వెకిల్ డ్రైవింగ్,రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం లాంటివి చేయకూడదని తెలిపారు. ప్రస్తుత కాలంలో యువత ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారు. ఇందుకు కారణం వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో అధికంగా ద్విచక్ర వాహనదారులపై మరణిస్తున్నారు. ఇందుకు ప్రధాన ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడం వలనే, మీ సౌకర్యార్థం కోసం మీ తల్లిదండ్రులు మీకు వాహనాలు అందిస్తే నేటి యువత వాహనాలు అజాగ్రత్త, వేగంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తు వాహనాలను నడిపిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై కన్నవారికి కన్నిటిని మిగులుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి, ఆర్టిఐ రంగారావు, పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్ద పల్లి ఎస్సై రాజేష్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
