శివ దర్శనానికి వెళ్లి వస్తానని చెప్పి అనంత లోకాలకు

– మంచిర్యాల జిల్లా జైపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

  • ఒకే గ్రామానికి చెందిన నలుగురు కలిసి జైపూర్ మండలం వేలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది

మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన యువకులకి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన నలుగురు మిత్రులు ధరావత్ రవి నాయక్ (26) ఆయనకు చెందిన ఏపీ 29బిజె 4634 లో వేలాల జాతరవెళ్లి శివుని దర్శనం కోసం వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. దాని ప్రకారమే అదే గ్రామానికి చెందిన భూక్య రాజేష్ నాయక్ ,భూక్య చిరంజీవి ,మరో వ్యక్తి దరవత్ రవి కలిసి భీమారం మీదుగా మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. ఇదే క్రమంలో జైపూర్ హైవే లోని స్థానిక సమ్మక్క – సారక్క టెంఫుల్ దాటినా తర్వాత చెన్నూర్ వైపునకు వెళ్తున్న ఇసుక లారీ ఏపీ 15టీఏ 1934 లారీ అతి వేగంగా వస్తుండటం తో తప్పించ బోయిన కారు లారీని ఢీకొట్టింది దీనితో అక్కడ కార్ లోని ఇంజన్ చెల్లాచెదురుగా పడ్డాయి. కారు తుక్కు తుక్కు కాగా లారీ ముందు భాగం డ్యామేజ్ అయింది. దీనితో స్థానికులు కార్ లో ఇర్దుకున్న దరవత్ రవిని ఎంతో శ్రమించి తీసి ఆసుపత్రికి తరలించే లోపే దరవత్ రవి (26) వాహన దారుడు మృతి చెందాడు. భూక్య చిరంజీవి (28)కి సైతం తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. భూక్య రాజేష్ నాయక్ కాలుతో పాటు మరి కొన్ని చోట్ల తీవ్ర గాయాలు కాగా , మరో దరవత్ రవికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకే గ్రామానికి చెందిన వారు కాగా బూర్గుపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయు. మృతువులోని వారి స్నేహం వీడలేదు సంఘటన స్థలంన్నీ భీమారo ఎస్ఐ అశోక్ పరిశీలించారు.కాగా వీరిని తలిస్తున్న 108 కు మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి పైనా పంచర్ కాగా మరో వాహనo లో వారిని తరలించారు. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శివుని దర్శనము కోసం వెళ్లి వస్తా అని చెప్పి వచ్చారని , వాళ్ళని మీ దగ్గరకే తీసుకెళ్లావా దేవుడా అని కుటుంబ సభ్యులు విలపించసాగారు. కాగ మాజీ జెడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్ తో పాటు ,భీమారo గ్రామానికి చెందిన యువకులు వారిని మంచిర్యాల కు తరలించారు.