మహా వెలుగు , పెద్దపల్లి 02 : నిబంధనలకు విరుద్ధంగా సరైన పత్రాలు లేకుండా ఓవర్ లోడ్ తో వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ డ్రైవర్స్ నీ హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, అధికారులతో కలిసి అధిక ఓవర్ లోడ్ తో వెళుతున్నటువంటి కర్ర లారీలను ఆపి వాటికి జరిమానాలు విధించడం జరిగింది. గత రెండు రోజుల నుండి 50 కర్ర లారీల డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు విధించడం జరిగింది.
ఈసందర్బంగా ఇంచార్జ్ డీసీపీ మాట్లాడుతూ…లారీలు ఓవర్ లోడ్, అతి వేగంగా వెళ్లడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఓవర్ లోడ్ కర్ర లారీలు రోడ్లపై నిలిచిపోయిన సమయంలో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతుందన్నారు. అధిక లోడ్ ఉన్న కర్ర లారీ పక్క నుండి వాహనాలు నడపాలన్నా వాహన దారులు భయపడుతున్నారు. లారీల డ్రైవర్స్ ఖచ్చితంగా తాటిపత్రితో పూర్తిగా కప్పి తాళ్ళతో గట్టిగా బిగించాలి అన్నారు.లారీ డ్రైవర్ లు నిద్ర లేకుండా అదే పనిగా సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు వాహనాలను నడుపుతుంటారు. దీంతో నిద్ర ఆవహించి ఆ మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంత సేపు విశ్రాంతి తీసుకుని అవసరం అయితే తిరిగి వాహనాన్ని నడపడం కొనసాగించాలి అని డ్రైవర్ లకు సూచించారు…ప్రతి ఒక్క వాహనదారునికి తాను, తన కుటుంబం ఎంత ముఖ్యమో మన ఎదురుగా వస్తున్న వ్యక్తులు, వాహదారులు అంతే ముఖ్యమన్న విషయం పదే పదే గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనలు పాటించని లారీల పట్ల కఠిన చర్యలు తప్పవు అన్నారు.రోడ్డు భద్రతా సూచనలు పాటిస్తే క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు.
ఈ తనిఖీల్లో పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్, పెద్దపెల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, బసంత్ నగర్ ఎస్సై మహేందర్, రామగుండం ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.