మహా వెలుగు, మంచిర్యాల 25 : ప్రమాదాల నివారణకై ప్రత్యేకంగా భారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నామని సిఐ సి. రాజు పేర్కొన్నారు. భీమారo పోలీస్ స్టేషన్ పరిధిలో అతి వేగంగా అజాగ్రత్తగా వాహనం నడుపుతూ ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని దానిని దృష్టి లో పెట్టుకొని శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు , భీమారం ఎస్సై అశోక్ ప్రమాదాలు నివారణ కై అవుడం క్రాస్ రోడ్ , బస్ స్టాండ్ ,ఆరెపల్లి రోడ్ ప్రాంతాలలో ఆర్ఎం పి ల సహాయ సహకారాలతో బ్యారికెట్స్ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ…..
ప్రతి డ్రైవర్ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని ప్రమాదాల నివారణ గురించి కృషి చేయాలని తెలిపారు. అధిక వేగం, మానవ తప్పిదం వల్ల ప్రమాదాలు జరిగే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సూచించారు. నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు తప్పకుండా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇన్సూరెన్స్ మోహనాల ఫిట్నెస్, కలిగి ఉండి వాహనాలు నడపాలని పరిమితికి మించి వాహనం వేగంగా నడవదని సూచించారు.వాహనాలు రోడ్డుపై నిలపడం వల్ల ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టుకొని ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎవరైనా సెల్ ఫోనులో మాట్లాడుతూ వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.ప్రతి వాహనదారుడు తనకు తానుగా మరి వాహనాలు నడిచినప్పుడే రోడ్డు ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుందని తెలిపారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , ఎంపీడీఓ శ్రీనివాస్ ,ఎంపివో శ్రీపతి బాపు , సర్పంచ్ గద్దె రాం రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….
