దాoపూర్ గ్రామ పంచాయతీ లోని గోత్రాలు వాడలో నూతనంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంకు సంతోషం భాస్కర్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించగా , గోత్రాల కాలానికి చెందిన కాలనీవాసులు శాలువాలతో సర్పంచ్ కు సన్మానం నిర్వహించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. బాల్క సుమన్ చొరవతో గ్రామంలోని వీధులకు రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ..గత నలభై సంవత్సరాలుగా గోత్రాల వాడకు రోడ్డు నిర్మాణం జరగలేదని ,ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక చొరవతో మా కాలనీకి రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాళ్ల రవి , గోత్రాల కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల వేణు, నారాయణ ,చెకొండ శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.