రొట్టెల పెనంతో భార్యను చంపిన భర్త

మహా వెలుగు ,జన్నారo :22 కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసిన ఘటన జన్నారం మండలంలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన అంగన్వాడీ సూపర్వైజర్ రాజేశ్వరి(45), భర్త కృష్ణమూర్తికి గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో రాజేశ్వరిపై భర్త కృష్ణమూర్తి ఇనుప రొట్టెల పెనంతో దాడిచేయగా ఆమె మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.