సైకో సంజయ్ సమాధానం చెప్పాలి : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్

మహా వెలుగు, హైదరాబాద్‌: డ్రంక్స్ పై బీజేపీ పార్టీ అధ్యక్షుడు సైకో సంజయ్ , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమాధానం ఇప్పుడు చెప్పాలని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు

బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్‌ వాడుతున్నట్లు బయటపడటంతో సంచలనంగా మారింది. పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా ఈ పబ్‌ ఘటనపై ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పబ్‌ నిర్వాహకులు జాతీయ పార్టీ నాయకులని, పబ్‌ ఓనర్‌ అభిషేక్‌ బీజేపీ నేత ఉప్పల శారద కొడుకని తెలిపారు.

ఈ ఘటనతో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల చిల్లర వ్యవహారాలు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. డ్రగ్స్‌ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహితులేనని, తెలిపారు.
కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని పేర్లు బయటకు వస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌ సప్లయిర్స్‌తో పాటు వాడకందార్లను అరెస్టు చేస్తున్నామని చెప్పారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పేకాట క్లబ్ లు మూసి వేశామన్నారు. మాట్లాడితే డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి అందర్నీ ఉరితీయాలని మాట్లాడతాడని ఇప్పుడు ఎవరిని ఉరితీయాలో తేల్చుకోవాల‌ని సుమ‌న్ ప్ర‌శ్నించారు. మాకు చిత్తశుద్ధి లేకుంటే ఇంత మందిని అరెస్టు చేస్తామా అని ప్రశ్నించారు. మాదకద్రవ్యాలపై కేసీఆర్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.