సల్లంగా చూడు పోచమ్మ తల్లి

మహా వెలుగు రామగుండము 28: రామగుండం మండలం గోదావరిఖనిలోని 37వ డివిజన్, భరత్ నగర్ ప్రజల అధ్వర్యంలో ఆదివారం జరిగిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్ పాల్గొన్నారు.

డివిజన్ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ప్రార్థించారు. పోతురాజు ఆటలు,శివసత్తుల నృత్యాలు,పిల్లల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో బస్తి పెద్దలు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో
పాల్గొన్నారు.