సపవట్ కుటుంబానికి పరామర్శ

  • పరామర్శించిన కురవి జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి

మహావెలుగు కురవి/మే1 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండల పోలంపల్లి తండా గ్రామ పంచాయితీ సర్పంచ్ సపవట్ మంగీ బాయ్ ఇటీవల అనారోగ్యం తో బాధపడుతూ హాటతుగా నాలుగురోజుల క్రితం మరణించడం జరిగింది.వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి భర్త బిచ్చు నాయక్ కుటుంబాన్నీ కురవి జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి , తెరాస యువ నాయకులు గుగులోతు శ్రీరామ్ నాయక్ పరామర్శించారు.వారికి 5000 ఆర్ధిక సహాయం అందజేశారు. వారితో పాటు తెరాస నాయకులు డాక్టర్ సుందర్ నాయక్,బీబీ నాయక్ తండా బొడ శ్రీను,బుజ్జి బద్రు నాయక్,రాజు నాయక్, లాల్లు నాయక్,చిట్టి బాబు,లక్పతి, మోతీలాల్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.