maha velugu : శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యం అని పెద్దపల్లి ఇన్చార్జి డిసిపి చెన్నూరి రూపేష్ పేర్కొన్నారు.
ఈరోజు పెద్దపల్లి డిసిపి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా లోని ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలతో మమేకమై పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన డిసిపికి పెద్దపల్లి ఏసిపి లు సారంగపాణి, గిరి ప్రసాద్, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, రాజవర్దన్, మహేందర్, అశ్విని తో పాటు సిబ్బంది మొక్కలు అందించే స్వాగతం పలికారు.
