వైయస్సార్ టీ పి పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర

  • ప్రజా ప్రస్థానం పాదయాత్ర బయ్యారంలో నాలుగు గంటల 30 నిమిషాల నుండి ప్రారంభం

మహా వెలుగు, ప్రతినిధి మహబూబాబాద్ 11 : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాభై రెండు రోజులుగా ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్నారు.

ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పాదయాత్ర ముగించుకుని నిన్న గార్ల మండలం పుల్లూరు ద్వారా మహబూబాబాద్ జిల్లా లోకి తన పాదయాత్ర ప్రస్థానం మొదలైంది.
గార్ల మండలంను ఉద్దేశించి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా రాంపురం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం దాల్చలేదని నిరుద్యోగ సమస్య రూపు మార్చ లేదని, ఇప్పుడున్న ప్రభుత్వం ధనిక వర్గానికి మాత్రమే పాలిస్తుందని, సమస్యలు పరిష్కారం అయ్యే అంతవరకు పోరాటం ఆపమని ఆమె తెలిపారు. ఈరోజు ప్రజాప్రస్థానం రూట్ మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. గార్ల మండలం 8 గంటల 30 నిమిషాలకు మొదలు కొని ని సాయంత్రం నాలుగు గంటల వరకు సత్యనారాయణపురం క్రాస్ రోడ్డు ద్వారా పాదయాత్ర బయ్యారం మండలం లోని కి సాగనున్నది. నాలుగు గంటల 30 నిమిషాలకు బయ్యారంలో బయ్యారం ప్రజలతో మాట ముచ్చట కార్యక్రమం జరుగుతుంది అనంతరం పాదయాత్ర బయ్యారం మండలం చర్లపల్లి గ్రామం లో బహిరంగ సభ నిర్వహిస్తారు అనంతరం రేపు ఉదయం బయ్యారం మండలం ఇరూసులా పురం గ్రామంలో నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తారు. తదనంతరం బయ్యారం మండలం లోని వివిధ గ్రామాల ద్వారా చివరకు ఇసుక మేది ద్వారా ఇల్లందు నియోజకవర్గ కేంద్రానికి చేరుతారు.

అనేక సమస్యలు బయ్యారం మండలాన్ని వేధిస్తున్న తరుణంలో షర్మిల పాదయాత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని ప్రజలు కోరుతున్నారు. బయ్యారం అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన కార్యక్రమాలు.

  1. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం.
  2. కాకతీయుల కాలం నాటి బయ్యారం పెద్ద చెరువు ను సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆ నీటిని బయ్యారం పెద్ద చెరువు వదిలి బయ్యారం పెద్ద చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చడం.
  3. పోడు భూముల సమస్య
  4. నిరుద్యోగ సమస్య
  5. తులారాం ప్రాజెక్టు అభివృద్ధి.
  6. సాదాబైనామా ల సమస్య
  7. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలు మరియు గూడెం ల సమస్య
  8. డబుల్ బెడ్ రూమ్ ల సమస్య
    ఇలా అనేకానేక సమస్యలు బయ్యారం మండలం ప్రారంభం నుండి షర్మిల దృష్టికి రానున్నాయి