ఫెర్టిలైజర్ షాపులలో విత్తన టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు

మహావెలుగు కురవి: రిపోర్టర్ చల్ల వేణు 14 : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఫెర్టిలైజర్ షాపులలో వ్యవసాయ శాఖ కమీషనరేట్ కార్యాలయం నుండి విత్తన టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు చేశారు. శనివారం కురవి లో విత్తన టాస్క్ ఫోర్స్ అధికారులు ముమ్ముర తనిఖీలు చేపట్టి విత్తనాల రిజిస్టర్.. లైసెన్స్ ఇన్వాయిస్ విత్తనాల పాకెట్స్ ను క్షుణ్ణంగా పరిశీలన చేపట్టి అక్కడికక్కడే విత్తన పరీక్షలు నిర్వహించినారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా జిల్లాలో ఎలాంటి నాసిరకం నకిలీ విత్తనాలు ప్రవేశించకుండా ముందుగానే విసతృతంగా తనిఖీలు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఉన్నతధికారుల అదేశం మేరకు జిల్లాలో చేపడుతున్నామని వ్యవసాయ శాఖ అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే అమ్మకాలు జరపాలని నిబంధనలకు విరుద్ధంగా చేస్తే కఠిన చర్యలు మరియు క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్టు ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

రైతులు అదీకృత డీలర్స్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని అపరచిత వ్యక్తులు గ్రామాలలో తిరుగుతూ గుడ్డ చంచులలో అమ్మాజూపే విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని చూసించినారు.

ఈ తనిఖీలలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ఛత్రు నాయక్, కురవి వ్యవసాయ అధికారి మంజూఖాన్, ఏడీఎ ఉషా, బి. రామానుజం ఏసీపీ, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ వేణుమాధవ్ పాల్గొన్నారు.