మహా వెలుగు మంచిర్యాల : వారు చిన్న నాటి స్నేహితులు తన స్నేహితుడు గత నెల మంచిర్యాల జిల్లా నస్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా తన జ్ఞాపకార్థం ప్రయాణికులకు బెంచీల ను ఏర్పాటు చేశారు. భీమారo మండల కేంద్రంలోని బస్టాండ్ లో ఒక్క సిమెంట్ బెంచ్ వేయగా .. ఆవుడం క్రాస్ సమీపంలో మరో బెంచీని ఏర్పాటు చేసి చలువ పందిరి సైతం వేశారు. తమ స్నేహితుని జ్ఞాపకార్థం బెంచీలను ఏర్పాటు చేసిన భీమారo జిల్లా పరిషత్ పాఠశాల 2007 -2008 పదోతరగతి బ్యాచ్ కగా వారిని గ్రామ పంచాయతీ ప్రజలతో పాటు ,మండల ప్రజలు ,ప్రయాణికులు షోషల్ మీడియా వేదికగా అభినందించారు.
