సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.

కురవి, టి ఎస్ టి డబ్ల్యూ ఆర్ ఎస్ జె సి(గర్ల్స్)పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి

మహ వెలుగు మహబూబాబాద్ జిల్లా కురవి మండల/జూలై31:కేంద్రంలోని
సోమవారం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్టు, కురవి గురుకుల జూనియర్ కళాశాల చీఫ్ సూపర్డెంట్ ఎస్ .కవిత ,డిపార్ట్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.
ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం పరీక్షలను, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నామని ,విద్యార్థులు స్టాప్ పూర్తి కోవిధి (కోవిడ్) నిబంధనలు పాటించాలని కోరారు. ఈ పరీక్షలు నిర్వహణలో స్థానిక ఎమ్మార్వో గారు ,స్థానిక ఎస్సై గారు ,వైద్య& ఆరోగ్య శాఖలు ,పోస్టల్, విద్యుత్ శాఖ సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు . విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రం చేరుకొని పూర్తి ధైర్యంతో పరీక్షలు రాయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.